Homeగాసిప్స్పవన్ చిత్రానికి దేవి శ్రీ రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?

పవన్ చిత్రానికి దేవి శ్రీ రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?

పవన్ చిత్రానికి దేవి శ్రీ రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?
పవన్ చిత్రానికి దేవి శ్రీ రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?

దేవి శ్రీ..ఈ పేరు వింటే చాలు సంగీత ప్రియుల్లో అలజడి మొదలవుతుంది. ఎన్నో సూపర్ హిట్ మ్యూజికల్ ఆల్బంస్ అందించిన దేవి శ్రీ..రీసెంట్ గా పుష్ప తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు పలు రికార్డ్స్ సైతం బ్రేక్ చేసింది. ఈ చిత్ర సాంగ్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే. సుకుమార్ – దేవి – బన్నీ ల కలయికలో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన పుష్ప..తగ్గిదేలే అనిపించింది.

ఇదిలా ఉంటె ప్రస్తుతం దేవి శ్రీ..హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో దేవి – పవన్ – హరీష్ కలయికలో గబ్బర్ సింగ్ చిత్రం వచ్చి పెద్ద విజయం సాధించింది. ఇప్పటికి ఈ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి.

- Advertisement -

ఈ తరుణంలో మరోసారి వీరి ముగ్గురి కలయికలో మూవీ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ మూవీ కి గాను దేవి శ్రీ ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇదే గనుక నిజమైతే ఇప్పటి వరకు ఆయన తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదేగా రికార్డు లో నిలుస్తుంది. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All