
కట్టుకున్న మొగుడ్ని క్రికెట్ బ్యాట్ తో కొట్టి సంచలనం సృష్టించింది దీపికా పదుకోన్ . రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకోన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . తాజాగా ఈ ఇద్దరూ కలిసి కపిల్ దేవ్ బయోపిక్ ” 83 ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో కలిసి నటిస్తుండటం అలాగే క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో బ్యాట్ తీసుకొని రణ్ వీర్ సింగ్ ని కొట్టడం స్టార్ట్ చేసింది దీపికా పదుకోన్ .
దాని తాలూకు వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ మరింత రచ్చ చేసాడు రణ్ వీర్ సింగ్ . 1983 లో కపిల్ దేవ్ నేతృత్వం లోని భారత్ జట్టు వరల్డ్ కప్ ని గెల్చుకుంది దాంతో ఆ నేపథ్యాన్ని ఇతివృత్తంగా ఎంచుకొని 83 అనే చిత్రం చేస్తున్నారు . ఈ సినిమా 2020 లో విడుదల కానుంది . ఇక కపిల్ దేవ్ గా రన్ వీర్ సింగ్ నటిస్తుండగా కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తోంది .