HomeVideosఐదు ఓటీటీల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ష‌కీలా `DDD` స్ట్రీమింగ్‌!

ఐదు ఓటీటీల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ష‌కీలా `DDD` స్ట్రీమింగ్‌!

ఐదు ఓటీటీల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ష‌కీలా `DDD` స్ట్రీమింగ్‌!
ఐదు ఓటీటీల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ష‌కీలా `DDD` స్ట్రీమింగ్‌!

హాట్ బాంబ్ షెల్ ష‌కీలా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `DDD` (డెడ్లీ డేంజ‌ర‌స్ డ్రీమ్‌).  ద్యావుడా, శీల‌వ‌తి, లేడీస్ నాట్ అలోవ్డ్ వంటి చిత్రాల ద‌ర్శ‌కుడు సాయిరాం దాస‌రి ఈ చిత్రాన్ని రూపొందించారు. సాయిరాం దాస‌రి, లండ‌న్ గ‌ణేష్ సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడూ ఊహ‌కంద‌ని క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న సాయిరాం దాస‌రి ప్ర‌స్తుతం మ‌రో షాకింగ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

ఇందు కోసం సెక్సీ సిరేన్ ష‌కీలాని ఎంచుకున్నారు. ష‌కీలా డెడ్లీ డేంజర‌స్ డ్రీమ్‌ని ప్ర‌ధాన క‌థ‌గా తీసుకుని సాయిరాం దాసరి తాజా చిత్రాన్నితెర‌కెక్కించారు. ఈ నెల‌లోనే ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌, ఎమ్ ఎక్స్ ప్లేయ‌ర్‌, ఏయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌, విఐ మూవీస్, హంగామా ప్లే ఓటీటీల్లో ఈ వండ‌ర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అడ్వెంచ‌ర్ కోసం అడ‌వికి వెళ్లిన ఓ బృందానికి న‌ర‌మాంస భక్ష‌కులు ఎదురుప‌డితే ఏం జ‌రిగింది? .. ఊహించ‌ని ప‌రిణామానికి స‌ద‌రు బృందం ఎలా రియాక్ట్ అయింది?.. న‌ర‌మాంస భక్ష‌కుల నుంచి స‌ద‌రు బృందం ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌దే ఇందులో ఆస‌క్తిక‌రం.

- Advertisement -

ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు ఫేమ‌స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ విభిన్న‌మైన చిత్రాల్ని.. థ్రిల్ల‌ర్‌ల‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All