
సురేష్‌కృష్ణ రూపొందించిన `బాబా` అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా తరువాత రజనీ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నారని, హిమాలయాలకు వెళ్లిపోతారని అంతా ప్రచారం జరిగింది. దీంతో బయ్యర్లు ఎగబడి `బాబా` చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. కానీ ప్రచారం జరిగినంత రేంజ్‌లో `బాబా` వసూళ్లని సాధించకపోగా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్సీ రేట్లకు కొన్న బయ్యర్లు కోట్లల్లో నష్టపోయారు. ఈ విషయం తెలుసుకున్న రజనీ వారందరికి నష్టపరిహారం కట్టిస్తానని మాటిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆ తరువాత నష్టపరిహారాన్ని చెల్లించి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారాయన. తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితే `దర్బార్` సినిమాకు ఏర్పడినట్టు తెలుస్తోంది. అదేంటి రజనీ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందంటూ ప్రచారం జరిగిన ఈ సినిమాకి నష్టాలు రావడం ఏంటి? అని అంతా అనుకోవచ్చు కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నష్టాల్లో వున్నారట.
జనవిర 9న విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించిందని, 150 కోట్ల క్లబ్‌లో చేరిందని చిత్ర వర్గాలు ప్రకటించాయి. అయితే ఆ ప్రకటనకు వచ్చిన కలెక్షన్‌లకు ఎక్కడా పొంతన లేదని తాజాగా తెలుస్తోంది. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్‌లు రజనీ ని కలవాలని, తమ గోడు వెళ్లబోసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ రజనీ ఇంకా వారిని కలవలేదని కోలీవుడ్ వర్లాల్లో ఓ వార్త ప్రచారం జరుగుతోంది.