Homeటాప్ స్టోరీస్దర్బార్ లో ఆ 15 నిముషాలు అరాచకమే!

దర్బార్ లో ఆ 15 నిముషాలు అరాచకమే!

దర్బార్ లో ఆ 15 నిముషాలు అరాచకమే!
దర్బార్ లో ఆ 15 నిముషాలు అరాచకమే!

సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ చిత్రం మరో 24 గంటల్లో మన ముందుకు రానుంది. రజిని సినిమా అంటే ఉండే హంగామానే వేరు. అయితే గత కొన్ని చిత్రాలుగా రజినీ సినిమాలు వరసగా నిరుత్సాహపరుస్తున్నాయి. ఫ్యాన్స్ కోరుకున్న పూర్తి అంశాలతో రజినీ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో దర్బార్ సినిమాపై అంచనాలు మాత్రం బాగున్నాయి. ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న చిత్రం ఇదే అనే భావన దర్బార్ ప్రోమోలతోనే కలిగించింది. రజినీకాంత్ పూర్తి యాక్టివ్ మోడ్ లోకి మారిపోయి నటించినట్లు తెలుస్తోంది. ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో రజినీ చెలరేగిపోయాడని అంటున్నారు. అయితే ట్రైలర్ చూస్తే ఇందులో కథ కంటే రజినీ మ్యానరిజమ్స్ ప్రధానంగా మురుగదాస్ వర్కౌట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది కేవలం రజినీ మేనియా ఆధారంగా నడిచే సినిమా కాదని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేటివ్ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ కు ముందు ఒక 15 నిమిషాల ఎపిసోడ్స్ థియేటర్ లో అందరి చేత లేచి చప్పట్లు కొట్టించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మురుగదాస్ కూడా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని స్పష్టం చేసాడు. ఆ ఎపిసోడ్ లో వచ్చే ఒక ఫైట్ కూడా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

- Advertisement -

ఇందులో నయనతార పాత్ర కూడా కేవలం గ్లామర్ కోసమో, రజినీ ప్రేయసి గానో కాక తన పాత్రతో కథ కూడా ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. ఇక విలన్ సునీల్ శెట్టి, హీరో రజినీ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించడం పక్కా అని సమాచారం. మొత్తానికి దర్బార్ ద్వారా అటు రజినీ అభిమానులను సంతృప్తి పరుస్తూనే, సాధారణ ప్రేక్షకులను కూడా మెప్పించే అంశాలు దర్బార్ లో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రం దాదాపు 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. రెండు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. మరి ఈ పోటీ తట్టుకుని దర్బార్ ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All