Homeటాప్ స్టోరీస్దర్బార్ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

దర్బార్ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Darbar 4 days collection report
Darbar 4 days collection report

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. సంక్రాంతి సినిమాల్లో ముందుగా రావడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. జనవరి 9న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల పాటు పోటీ లేకపోవడంతో కుమ్మేసింది. మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా వసూలు చేసిన దర్బార్, రెండో రోజుకు కలిపి దాదాపు 6 కోట్లు రాబట్టగలిగింది.

అయితే ఇక స్ట్రెయిట్ సినిమాల హడావిడి మొదలయ్యాక దర్బార్ పూర్తిగా డౌన్ అయింది. జనవరి 11న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు విడుదలవడంతో దర్బార్ కు చాలా తక్కువ సంఖ్యలోనే థియేటర్లు మిగిలాయి. ఇక దర్బార్ కు మొదటి నుండీ యావరేజ్ రేటింగ్ రావడంతో అది కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. దీంతో దర్బార్ నాలుగు రోజులకు 7.57 కోట్ల షేర్ ను మాత్రమే సాధించింది. ఈ చిత్ర తెలుగు హక్కులను దాదాపు 14.5 కోట్లకు అమ్మారు. అంటే ఇంకా దాదాపుగా సగం రాబట్టాల్సి ఉంది.

- Advertisement -

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు రెండూ కూడా మంచి టాక్ తో దూసుకుపోతుండడంతో దర్బార్ కు పుంజుకోవడం ఇక కష్టమే. ఫుల్ రన్ లో మహా అయితే ఎనిమిదిన్నర కోట్లు రాబట్టొచ్చు. అయితే తమిళ వెర్షన్ దర్బార్ మాత్రం కుమ్మేస్తోంది. ఆల్రెడీ 100 కోట్ల కలెక్షన్ ను దాటి సూపర్ హిట్ అనిపించుకుంది.

దర్బార్ 4 డేస్ కలెక్షన్ రిపోర్ట్:

నైజాం :Rs 3.78 Cr

సీడెడ్ : Rs 0.92 Cr

గుంటూరు : Rs 0.57 Cr

వైజాగ్ : Rs 0.78 Cr

ఈస్ట్ : Rs 0.50 Cr

వెస్ట్: Rs  0.33  Cr

నెల్లూరు: Rs 0.29 Cr

కృష్ణ: Rs 0.40 Cr

ఆంధ్ర+తెలంగాణ : Rs 7.57 Cr Shares.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All