
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ లో ఇద్దరు హీరోల మధ్య ఇగో క్లాష్ ల ఆధారంగా చిత్రం నడుస్తుంది. లీడ్ రోల్ లో కనిపించే అయ్యప్ప, కోషిల పేర్ల మీద మలయాళంలో ఆ టైటిల్ పెట్టారు.
అయితే తెలుగులో మాత్రం పవన్ పాత్ర పేరునే టైటిల్ గా ఖరారు చేసారు. భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ కు టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రానా దగ్గుబాటి వంతు వచ్చింది. భీమ్లా నాయక్ లో రానా, డేనియల్ శేఖర్ పాత్రను పోషిస్తున్నాడు. డేనియల్ శేఖర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో సెప్టెంబర్ 20వ తారీఖున విడుదల కానుంది.
సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు.
DANIEL SHEKAR on the way!!#BLITZofDANIELSHEKAR from 20th Sept?#BheemlaNayak @pawankalyan #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/cHwNLe8xp0
— Rana Daggubati (@RanaDaggubati) September 17, 2021