
దర్శకుడు హరీష్ శంకర్ రెండోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పనిచేయనున్న విషయం తెల్సిందే. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈరోజు హరీష్ శంకర్ ఈ చిత్రానికి టైటిల్ ను ప్రకటించాడు.
వినూత్నంగా భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. దీంతో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు బైక్ పై కూర్చుని ఒక చేత్తో మెగాఫోన్, మరో చేత్తో గాజు గ్లాసులో ఛాయ్ ను పట్టుకుని ఉన్నాడు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిందనే చెప్పాలి. మునపటి పవన్ గుర్తుకురాక మానడు.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే అధికారికంగా సినిమాను లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు. రీసెంట్ గా హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య ఈ విషయంలో చర్చ కూడా నడిచింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
POWERFUL TITLE for the POWERFUL CUTOUT ????#BhavadeeyuduBhagatSingh – an indelible Signature on the Silver Screen ????
This time it’s not just Entertainment ????@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @venupro pic.twitter.com/yLs5LtMI2Q
— Mythri Movie Makers (@MythriOfficial) September 9, 2021