Homeటాప్ స్టోరీస్తెలుగు గ‌డ్డ‌పై బాలీవుడ్ హంగామా!

తెలుగు గ‌డ్డ‌పై బాలీవుడ్ హంగామా!

తెలుగు గ‌డ్డ‌పై బాలీవుడ్ హంగామా!
తెలుగు గ‌డ్డ‌పై బాలీవుడ్ హంగామా!

`బాహుబ‌లి` సంచ‌ల‌న విజ‌యంతో దేశ వ్యాప్తంగా వున్న సినీ ఇండ‌స్ట్రీల‌న్నీతెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌వైపు ఆశ్చ‌ర్యంతో చూశాయి. ఆ త‌రువాత నుంచి తెలుగులో ఏ సినిమా మొద‌లైనా దేశం మొత్తం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌వైపే తొంగి చూస్తోంది. ఇటీవ‌ల వ‌చ్చిన `అర్జున్‌రెడ్డి`, ఆర్ ఎక్స్ 100` లాంటి చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాలు  బాలీవుడ్‌తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ రీమేక్ అయి అక్క‌డ కూడా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో ఏ చిన్ని సినిమా మొద‌లైన ఆస‌క్తిగా చూస్తున్నారు. రీమేక్ రైట్స్ కోసం ఎగ‌బ‌డుతున్నారు.

ఇలాంటి త‌రుణంలో తెలుగు  గ‌డ్డ‌పై బాలీవుడ్ హంగామా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుస‌గా సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్న స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం `ద‌బాంగ్ 3`. ద‌బాంగ్ సిరీస్ చిత్రాల వ‌రుస‌లో వ‌స్తున్న సిరీస్ ఇది. స‌ల్మాన్ ల‌క్కీ డైరెక్ట‌ర్‌ ప్ర‌భుదేవా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌ల్మాన్ చుల్‌బుల్ పాండేగా న‌టిస్తున్న ఈ చిత్రంలో క‌న్న‌డ హీరో సుదీప్ విల‌న్‌గా క‌నిపించ‌న్నారు. రొటీన్ చిత్రాల‌కు భిన్నంగా స‌ల్మాన్ మార్కు మాస్‌మ‌సాలా ఎంటర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ఈ నెల 18న హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్‌లో జ‌ర‌గ‌బోతోంది.

- Advertisement -

ఒక బాలీవుడ్ స్టార్ హీరో సినిమా టాలీవుడ్‌లో ప్రీరిజ్ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌డం ఇదే మొట్ట‌మొద‌టి సారి కావ‌డంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. టాలీవుడ్ మార్కెట్‌పై స‌ల్మాన్ క‌న్నేశాడు కాబ‌ట్టే ప్రి రిలీజ్ ఈవెంట్‌ని తెలుగు గ‌డ్డ‌పై జ‌రిపేందుకు ప్లాన్ చేసిన‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ చిత్ర ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. క్లైమాక్స్ లో స‌ల్మాన్‌ఖాన్‌, సుదీప్ ఇద్ద‌రూ 8 ప్యాక్ బాడీతో క‌నిపించ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రిపై చిత్రీక‌రించిన పోరాట ఘ‌ట్టాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని బాలీవుడ్ టాక్‌. సోనాక్ష సిన్హా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ ముద్దుల త‌న‌య సైయి మంజ్రేక‌ర్ మ‌రో నాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో వ‌స్తున్న `ద‌బాంగ్ 3` ఈ నెల 20న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All