Homeగాసిప్స్దాన‌య్య‌ కొడుని ప‌రిచ‌యం చేస్తున్నాడు!

దాన‌య్య‌ కొడుని ప‌రిచ‌యం చేస్తున్నాడు!

దాన‌య్య‌ కొడుని ప‌రిచ‌యం చేస్తున్నాడు!
దాన‌య్య‌ కొడుని ప‌రిచ‌యం చేస్తున్నాడు!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ తొలి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీంల పాత్ర‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డివీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో దాదాపు మూడొంతుల‌కు మించి చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. చిత్ర బృందం ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య త‌న త‌న‌యుడు క‌ల్యాణ్ దాస‌రిని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని చాలా కాలంగా ప్క‌ర‌య‌త్నాలు చేస్తున్నారు. స‌రైన ద‌ర్శ‌కుడు, స్టోరీ సెట్ కాక‌పోవ‌డంతో గ‌త కొంత కాలంగా క‌ల్యాణ్ అరంగేట్రం వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా దాన‌య్య ద‌ర్శ‌‌కుడు శ్రీ‌వాస్‌ని త‌న త‌న‌యుడు క‌ల్యాణ్‌ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఎంచుకున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఇప్ప‌టికే స్క్రిప్ట్‌ని పూర్తి చేశార‌ట‌. లాక్‌డౌన్ త‌రువాత ప్ర‌భుత్వ అనుమ‌తుల‌ని బ‌ట్టి ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌నే ఆలోచ‌న‌లో దాన‌య్య వున్న‌ట్టు తెలిసింది. శ్రీ‌వాస్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్ల‌వుతోంది. బెల్లంకొండ /శ్రీ‌నివాస్‌తో శ్రీ‌వాస్ చేసిన చిత్రం  `సాక్ష్యం`. ఈ సినిమా హిట్ అనిపించుకున్నా మ‌రో సినిమాకు రెండేళ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All