Homeటాప్ స్టోరీస్షాక్: మా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన సీవీఎల్

షాక్: మా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన సీవీఎల్

షాక్: మా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన సీవీఎల్
షాక్: మా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన సీవీఎల్

సీనియర్ యాక్టర్ సీవీఎల్ ఈసారి మా ఎన్నికలలో నామినేషన్ వేసిన విషయం తెల్సిందే. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నానన్న సీవీఎల్ మ్యానిఫెస్టో కూడా విడుదల చేసాడు. అయితే అలా విడుదల చేసిన కొన్ని గంటలకే నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేసాడు. తన కలలోకి శ్రీరామ చంద్రుడు వచ్చాడని, నీకు మా సభ్యుల సంక్షేమం కావాలా, ప్రెసిడెంట్ పదవి కావాలా అని అడిగాడని, తన మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు.

అలాగే తనకు 6 కోట్ల రూపాయలు మా భవనం కోసం ఇచ్చే వ్యక్తి తెలుసనీ, ఎవరు ప్రెసిడెంట్ అయినా మా సంక్షేమం కోసం తాను సహకరిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ట్విస్ట్స్ చాలవు అన్నట్లుగా ఇప్పుడు మా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు సీవీఎల్. ఇది ‘మా’ లో చాలా మందికి షాకింగ్ గా అనిపించవచ్చు.

- Advertisement -

మా ఎన్నికలు ఏకగ్రీవం కాకుంటే తాను రాజీనామా చేస్తానని చెప్పిన కొన్ని గంటలకే సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. అయితే వీటి వెనుక కారణాలు తెలియలేదు కానీ సివిఎల్ ఈసారి మా ఎలక్షన్స్ సందర్భంగా చేసిందంతా కూడా ఒక సినిమాను తలపిస్తోంది. ఎక్కడికక్కడ ట్విస్ట్స్, టర్న్స్ తో ఆయన చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతేనేం మా ఎన్నికలు 10వ తేదీన జరుగుతాయి. ఫలితాలు ఒక రోజు తర్వాత అంటే 11వ తారీఖున వెల్లడవుతాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All