Homeటాప్ స్టోరీస్కరోనా వల్ల ఇండస్ట్రీ కి ఇంత నష్టమా.?

కరోనా వల్ల ఇండస్ట్రీ కి ఇంత నష్టమా.?

కరోనా వల్ల ఇండస్ట్రీ కి ఇంత నష్టమా.?
కరోనా వల్ల ఇండస్ట్రీ కి ఇంత నష్టమా.?

ప్రతీ దేశంలో సీజన్ మారినప్పుడల్లా మనుషులకు చిన్నా,పెద్ద ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా, ప్రపంచంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కొన్ని వైరస్ లు, కొన్ని వ్యాధులు ఎంచక్కా, పాస్ పోర్ట్, వీసా అవసరం లేకుండా ప్రపంచ దేశాలు తిరిగేసి, వాటి సరదా తీర్చుకుని, వీలైతే కొంతమందిని పైకి కూడా పంపిస్తూ ఉంటాయి. అలాంటి కేటగిరీ కి చెందినది కరోనా వైరస్. కరోనా వైరస్ వల్ల మనుషులు ఎంతమంది చనిపోయారనేది.? ఎవరికీ వాళ్ళు ఏవేవో లెక్కలు చెప్పడం, అసలు అన్నిటికీ మించి… ప్రజలను చైతన్యవంతం చెయ్యవలసిన ప్రధాన మీడియా వర్గాలు… ఇంకేముంది…అంతా అయిపొయింది..! అంటూ లేనిపోని ప్రచార్లు చెయ్యడం వల్ల అన్నిరకాల వృత్తి, విద్య, వ్యాపార, పరిశ్రమ, వినోద రంగాలకు పెద్ద దెబ్బ తగిలింది.

ఇక ప్రధానంగా సినిమా పరిశ్రమ లో అనేకమంది శ్రమిస్తూ ఉంటారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల అన్నిటికన్నా ముందు అవుట్ డోర్, ఫారెన్ షెడ్యూల్స్ కి అవాంతరం కలిగి, దాని ద్వారా ట్రావెల్, టూరిజం, సినిమా ప్రొడక్షన్, ఆర్టిస్ట్ ల కాల్షీట్స్ మిస్ అవ్వ్వడం జరిగి నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇక ఏదైనా ఒక పెద్ద సెట్ లో ఎక్కువమంది జూనియర్ ఆర్టిస్ట్ ల కాంబినేషన్ ఉన్న సీన్ లు కూడా షూట్ చెయ్యడం కష్టం అవుతుంది. ఇక సినిమాకు ముఖ్యంగా పనిచేసే ఆర్టిస్ట్ లు,టెక్నీషియన్స్ లలో కొంతమంది భయంతోనో, లేక మొదటి నుండి వారికి ఇమ్యునిటీ పవర్ తక్కువ ఉండటం వాళ్ళ షూటింగ్ లకు డుమ్మా కొట్టేస్తారు. వారు లేనప్పుడు, ఆల్టర్నేటివ్ చూసుకోకపోతే అది నిర్మాత నెత్తినే పడుతుంది. ఇవన్నీ తెర వెనుక కలిగే నష్టాలు.

- Advertisement -

ఇక రిలీజ్ కాబోయే సినిమాలకు అయితే ఇలాంటి వైరస్ ఎఫెక్ట్ వల్ల ప్రచార కార్యక్రమాలు, ఈవెంట్ లు, ఇంటర్వ్యూలు, అన్నీ మళ్ళీ ఒకసారి రీ డిజైన్ చెయ్యాల్సి వస్తుంది. సినిమాలు కొనుక్కునే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ముందే…. బయట పరిస్థితి బాలేదు కదా..! అని తక్కువకే అడుగుతారు. అదేమంటే, తర్వాత సినిమాలో చూసుకుందాం… అంటారు. ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిన తరువాత సినిమాను కొంచెం నష్టానికి అయినా…. అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది.

రిలీజ్ అయ్యాక కూడా, ఎవరో సినిమాలను బాగా ఫాలో అయ్యే వాళ్ళు తప్ప, కామన్ ఆడియెన్స్, ఫ్యామిలీలు, ఇలా వైరస్ ఎఫెక్ట్ వల్ల సినిమా చూడటానికి అంతగా ఇంటరెస్ట్ చూపించరు. అన్నీ కలిపి సినిమాతీసిన,చేసిన, కొన్న వాళ్ళకు నష్టాలు బాధ మిగులుతుంది. పెద్ద సినిమాలు అయితే రిలీజ్ లు ఇంకొక రెండు,మూడు వారాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ చిన్న సినిమాలు అలా కాదు…. మళ్ళీ ఈ నెలాఖరికి ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది. దేశవ్యాప్తంగా కొంతమంది సినిమా ప్రేక్షకులు అటు డీవియేట్ అవుతారు .

కాబట్టి ఇలాంటప్పుడు ఎవరిని ఎవరు ఏమీ అనలేక…. బాధ మనసులో పెట్టుకుని నష్టాలు, అప్పులు ముందుపెట్టుకుని “అప్నా టైం ఆయేగా” అనుకోవడమే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All