Homeటాప్ స్టోరీస్దేశంలో కరోనా పాజిటివ్ మరియు మరణాల వివరాలు

దేశంలో కరోనా పాజిటివ్ మరియు మరణాల వివరాలు

దేశంలో కరోనా పాజిటివ్ మరియు మరణాల వివరాలు
దేశంలో కరోనా పాజిటివ్ మరియు మరణాల వివరాలు

భారతదేశంలో కూడా కరోనా వైరస్ నెమ్మదిగా తన ప్రభావం చూపిస్తోంది. ఒకటే కదా రెండే కదా అనుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు ఆ లిస్ట్ 220 దాటడం విశేషం. అంతే కాకుండా కరోనా వల్ల ఇప్పటికే నలుగురు చనిపోయారు. ఇప్పటివరకూ టెస్ట్ చేసిన వాళ్ళు తక్కువ ఉండడంతో ఈ సంఖ్య తక్కువగా ఉందని లేదంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వాలు మాత్రం చేయాల్సినదంతా చేస్తున్నారు. స్కూల్స్, థియేటర్లు, మ్యూజియం వంటివన్నీ మూసివేశారు. దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీలైనంత బయట తిరగడం తగ్గించమని చెబుతున్నారు.

మరోవైపు రీసెంట్ గా నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఆదివారం అందరూ జనతా కర్ఫ్యూ విధించాలని పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ తమ ఇళ్ళు వదిలి బయటకు రాకూడదని పిలుపునిచ్చాడు. అలాగే సాయంత్రం 5 గంటలకు తమ కోసం కష్టపడుతున్న వివిధ వర్గాలకు సంఘీభావం కింద ఏదొక చప్పుడు చేయాలని అన్న సంగతి తెల్సిందే.

- Advertisement -

ఇప్పుడు భారతదేశంలో కరోనా వైరస్ వివరాలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో చూద్దాం.

రాష్ట్రం : పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ : 03

ఢీల్లీ : 17

హర్యానా : 17

కర్ణాటక : 15

కేరళ : 28

మహారాష్ట్ర : 52

పంజాబ్ : 02

రాజస్థాన్ : 17

తమిళనాడు : 03

తెలంగాణ : 17

ఉత్తర్ ప్రదేశ్ : 23

ఉత్తరాఖండ్ : 03

జమ్మూ అండ్ కాశ్మీర్ : 04

గుజరాత్ : 05

ఛత్తీస్గఢ్ : 01

ఒడిశా : 02

పుదుచ్చేరి : 01

చండీగఢ్ : 01

లఢక్ : 10

పశ్చిమ బంగ : 02

మొత్తం : 223

రాష్ట్రం : మరణాలు

ఢిల్లీ : 1

కర్ణాటక : 1

మహారాష్ట్ర : 1

పంజాబ్ : 1

మొత్తం మరణాలు : 4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All