Homeటాప్ స్టోరీస్జీ5 ఈ రేసులో అగ్ర స్థానంలో నిలిచిందా?

జీ5 ఈ రేసులో అగ్ర స్థానంలో నిలిచిందా?

జీ5 ఈ రేసులో అగ్ర స్థానంలో నిలిచిందా?
జీ5 ఈ రేసులో అగ్ర స్థానంలో నిలిచిందా?

క‌రోనా వైర‌స్ ఏ రంగాన్నీ విడిచిపెట్ట‌లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న ప్ర‌తీ రంగం దీని కార‌ణంగా ఇబ్బందులు, ఆర్థికంగా న‌ష్టాల‌ని చ‌విచూస్తోంది. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాలు ఒక విధంగా చెప్ఆలంటే ద‌ర్భ‌రంగా మారాయి. క‌నీస అవ‌సరాల కూడా తీర్చుకోలేని స్థితిలోకి చాలా కుటుంబాలు చేరుకుంటున్నాయి. ఓ ప‌క్క క‌రోనా సాకుతో ప‌లు ప్రైవేట్ సెక్టార్‌ల‌న్నీ ఉద్యోగుల్ని తొల‌గిస్తూ వారి జీవితాల్ని మ‌రింత భ‌యంక‌రంగా మారుస్తున్నాయి. ‌

అయితే ఇంత విధ్వంసం జ‌రుగుతున్నా కొన్ని  సంస్థ‌ల‌కు ఈ విప‌త్క‌ర ప‌రిస్థితే బిగ్ అడ్వాంటేజ్‌గా మారింది. ఇంత‌కు ముందు ఈ సంస్థ‌లంటే కొంత మంది మాత్ర‌మే ఆస‌క్తిని చూపించేవారు కానీ క‌రోనా కార‌ణంగా గ‌తంలో వున్న వారి సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయింది. విష‌యం ఏంటంటే గ‌తంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా వుండేది. అఇ ఓ సెప‌రేట్ వ‌ర్గంగా అంతా భావించే వారు క‌రోనా కార‌ణంగా అంతా ఇంటిప‌ట్టునే వుండ‌టంతో కాల క్షేపం కోసం టీవీల‌ని ప‌క్క‌న పెట్టి ఓటీటీల‌ని ఆశ్ర‌యించ‌డం మొద‌లుపెట్టారు.

- Advertisement -

టీవీ సీరియ‌ల్స్‌, సినిమా షూటింగ్‌లు నిలిపివేయ‌డంతో లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటి ప‌ట్టునే వుంటున్న జ‌నానికి వినోదం అందుబాటులో లేకుండాపోయింది. దీంతో అత్య‌ధిక శాతం జ‌నాలు ఓటీటీల‌ని న‌మ్ముకోవ‌డం మొద‌లైంది. రెండు నెల‌లుగా లాక్‌డౌన్ పిరియ‌డ్ న‌డుస్తున్న నేప‌థ్యంలో ఓటీటీల‌కి స‌బ్‌స్క్రైబ‌ర్స్ పెరిగిపోయారు. జీ5, దిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, అమెజాన్ ప్రైమ్‌ల‌లో అత్య‌ధిక శాతం జీ5కే స‌బ్‌స్క్రైబ‌ర్స్ పెరిగిపోయారు. దీంతో ఈ లాక్‌డౌన్ టైమ్ జీ5కి బాగా క‌లిసి వ‌చ్చిందంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All