Homeటాప్ స్టోరీస్కేసీఆర్ కు చుక్కలు చూపిస్తానంటున్న జగ్గారెడ్డి

కేసీఆర్ కు చుక్కలు చూపిస్తానంటున్న జగ్గారెడ్డి

Congress leader jaggareddy fires on kcrకాంగ్రెస్ పార్టీ నాయకుడు , మాజీ ఎం ఎల్ ఏ జగ్గారెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగాడు . వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు కేసీఆర్ కు చుక్కలు చూపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు . మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించిన విషయం తెలిసిందే . కాగా బెయిల్ మంజూరు కావడంతో నిన్న రాత్రి విడుదలయ్యాడు . జైలు నుండి విడుదలైన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజులు లెక్కపెట్టుకో కేసీఆర్ , వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడు నీకు చుక్కలు చూపిస్తా …… ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను కూడా ఉపేక్షించేది లేదని సవాల్ విసిరాడు జగ్గారెడ్డి .

కేసీఆర్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు జగ్గారెడ్డి దాంతో అతడిపై మానవ అక్రమ రవాణా కేసు ఉండటంతో అరెస్ట్ చేసి జైలుకి తరలించారు . అసలు ఈ కేసులో పేర్లు ఉన్నది కేసీఆర్ , హరీష్ రావు ల పేర్లు కానీ నన్ను బలిపశువుని చేసారని , టిఆర్ ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు లేవు మరి వాళ్ళని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయరని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు జగ్గారెడ్డి . సంగారెడ్డి ఎం ఎల్ ఏ గా ప్రాతినిధ్యం వహించిన జగ్గారెడ్డి మళ్ళీ అదే నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నాడు .

- Advertisement -

English Title: Congress leader jaggareddy fires on kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All