Homeటాప్ స్టోరీస్ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ గా అలీ !

ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ గా అలీ !

Comedian Ali gets nominated post From Jagan
Comedian Ali gets nominated post From Jagan

ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ గా అలీ !

హాస్య నటుడు అలీ ని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక మండలి ( ఏపీ ఎఫ్ డీసీ ) చైర్మన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ రెండు మూడు రోజుల్లోనే ఈ మేరకు ఓ ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది . జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసాడు అలీ .

- Advertisement -

ఎన్నికల ముందు జగన్ ని కలిసి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు దాంతో అప్పుడే అసెంబ్లీ కి పోటీ చేసే అవకాశం లభిస్తుందని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో పార్టీలో చేరడంతో ప్రస్తుతానికి ప్రచారం చేయండి తర్వాత తప్పకుండా మీకు తగిన గౌరవం ఇస్తానని హామీ ఇచ్చాడట జగన్ . దాంతో అప్పుడు ఇచ్చిన హామీ మేరకు అలీ ని ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అలీ తన సన్నిహితులకు ఈ విషయం చేరవేయడంలో ఫిలిం నగర్ సర్కిల్లో లీకయ్యింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All