Homeటాప్ స్టోరీస్`క‌ల‌ర్ ఫొటో` కూడా అదే బాట‌ప‌డుతోంది!

`క‌ల‌ర్ ఫొటో` కూడా అదే బాట‌ప‌డుతోంది!

Colour Photo ready to release in ott plotform aha
Colour Photo ready to release in ott plotform aha

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెద్ద చిత్రాల‌నే కాదు చిన్ని చిత్రాల‌పై కూడా ప‌డుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వైర‌స్ కార‌ణంగా థియేట‌ర్లు రీ ఓపెన్ చేయ‌డం అసాధ్యంగా క‌నిపిస్తున్న నేప‌థ్యంలో చిన్నా .. పెద్దా అని తేడా లేకుండా ఆస‌క్తి వున్న నిర్మాత‌లు త‌మ చిత్రాల్ని ఓటీటీల‌కే ఇచ్చేయ‌డానికి రెడీ అవుతున్నారు. వి, ఆకాశ‌మే నీ హ‌ద్దురా వంటి చిత్రాలు కూడా ఓటీటీ బాట ప‌ట్ట‌డంతో చిన్ని చిత్రాలు సైతం అదే దారిలో ప‌య‌నిస్తున్నాయి.

తాజాగా ఈ జాబితాలో `క‌ల‌ర్ ఫొటో` చేర‌బోతోంది. హృద‌య కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట వంటి స్ఫూఫ్ చిత్రాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకున్న అమృత ప్రొడ‌క్ష‌న్స్ `క‌ల‌ర్ ఫొటో` చిత్రాన్ని నిర్మిస్తోంది. మ‌జిలీ, డియ‌ర్ కామ్రేడ్‌, ప్ర‌తిరోజు పండ‌గే వంటి చిత్రాల‌తో న‌టుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సుహాస్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. చాందినీ చౌద‌రి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రం ద్వారా సందీప్ రాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

- Advertisement -

సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ఆహాలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే డీల్ కూడా సెట్ట‌యిన‌ట్టు తెసుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All