Homeటాప్ స్టోరీస్`క‌ల‌ర్ ఫొటో`తో సునీల్ కొత్త అవ‌తారం!

`క‌ల‌ర్ ఫొటో`తో సునీల్ కొత్త అవ‌తారం!

`క‌ల‌ర్ ఫొటో`తో సునీల్ కొత్త అవ‌తారం!
`క‌ల‌ర్ ఫొటో`తో సునీల్ కొత్త అవ‌తారం!

క‌మెడియ‌న్‌గా సునీల్ వెండితెర‌పై న‌వ్వుల పువ్వులు పూయించారు. త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో కొన్నేళ్ల పాటు న‌వ్వించారు. ఆ త‌రువాత హీరోగా `అందాల రాముడు`తో కొత్త జ‌ర్నీ మొద‌లుపెట్టారు. `మ‌ర్యాద‌రామ‌న్న‌` బాక్సాఫీస్ వ‌ద్ద హీరోగా త‌న స‌త్తా ఏంటో చూపించారు. వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేశారు. ఆ త‌రువాత కూడా హీరోగా ఆక‌ట్టుకున్న సునీల్ తాజాగా కొత్త అవ‌తారం ఎత్త‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌జిలీ, డియ‌ర్ కామ్రేడ్‌, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌, ప్ర‌తిరోజు పండ‌గే వంటి హిట్ చిత్రాల్లో హీరో ఫ్రెండ్‌గా న‌టించి ఆక‌ట్టుకున్న సుహాస్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `క‌ల‌ర్ ఫొటో`. హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట వంటి స్ఫూఫ్ చిత్రాల్ని అందించిన సాయి రాజేష్ నీలం అమృత ప్రొడ‌క్ష‌న్స్‌పై అందిస్తున్న ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్, హీరో సునీల్ విల‌న్‌గా స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నాడు. యూట్యూబ్ వీడియోస్‌తో పాపుల‌ర్ అయిన సందీప్‌రాజ్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

- Advertisement -

సునీల్ పుట్టిన రోజు నేడు (శుక్ర‌వారం). ఈ చిత్రంలో ఆయ‌న‌ రామ‌రాజు అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా సునీల్ ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర బృందం తాజాగా విడుద‌ల చేసింది. 1995లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జ‌రిగిన య‌దార్థ ప్రేమ‌క‌థ ఆధారంగా ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. చాందీనీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఈ సినిమాతో సునీల్ కెరీర్ మ‌రో మ‌లుపు తిరగ‌డం ఖాయ‌య‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All