Homeటాప్ స్టోరీస్గ్యాంగ్ లీడర్ తో రచ్చ చేస్తానంటున్న మోహన్ కృష్ణ

గ్యాంగ్ లీడర్ తో రచ్చ చేస్తానంటున్న మోహన్ కృష్ణ

గ్యాంగ్ లీడర్ తో రచ్చ చేస్తానంటున్న మోహన్ కృష్ణ
గ్యాంగ్ లీడర్ తో రచ్చ చేస్తానంటున్న మోహన్ కృష్ణ

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన మోహన్ కృష్ణ, చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన గ్యాంగ్ లీడర్ టైటిల్ తో మన ముందుకు వస్తున్నారు. దీనికి మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనే క్యాప్షన్ ను జతచేయడం విశేషం. ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని హంగులు అద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మోహన్ కృష్ణ ప్రయత్నిస్తున్నారు.

కాగా జూన్ 8న మోహన్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర మోషన్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. గ్యాంగ్ లీడర్ చిత్రానికి ట్రేడ్ మార్క్ మ్యూజిక్ ను దీనికి కూడా వాడుకోవడం విశేషం. స్టైలిష్ గా మోహన్ కృష్ణ నిల్చున్న పోస్టర్ సినిమాపై మంచి ఇంప్రషన్ ను కలిగిస్తుంది. గ్యాంగ్ లీడర్, మళ్ళీ మొదలవుతుంది రచ్చ చిత్రానికి ఎస్.ఎం.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని ఎన్.వి.వి సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. ఘనశ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

మరి చిరంజీవి టైటిల్ తో చిరంజీవి ఫ్యాన్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకూ అలరిస్తుందో చూద్దాం. అలాగే మోహన్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది టాలీవుడ్.నెట్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All