Homeగాసిప్స్బాలయ్య, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి..

బాలయ్య, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి..

బాలయ్య, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి..
బాలయ్య, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి..

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య బయటకు అంతా బాగానే ఉంటుంది కానీ లోపల ఏదో గ్యాప్ అయితే కచ్చితంగా అనిపిస్తుంది. ఇద్దరి విషయంలో గతంలో పలు మార్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసుకోవడం మనం చూసాం. మళ్ళీ కొన్ని రోజులకు బయట ఏదైనా ఫంక్షన్ లో కనిపిస్తే చక్కగా మాట్లాడుకుంటారు. ఇక ఫ్యాన్స్ కూడా రెండు భిన్న వర్గాలకు చెందిన వారు. మెగా క్యాంప్, నందమూరి క్యాంప్ కు ఎప్పుడూ గొడవలు అవుతుంటాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో ను చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మంచు మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్, లక్ష్మి ప్రసన్న కూడా విచ్చేస్తారని తెల్సింది. ఇప్పటికే బాలయ్యతో ఈ షో కు సంబంధించిన ప్రోమో షూట్ కూడా జరిగిందిట.

- Advertisement -

మరో విశేషం ఏమిటంటే అన్ స్టాపబుల్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా విచ్చేస్తాడని తెలుస్తోంది. అల్లు అరవింద్, చిరుని కలిసి ఈ విషయంపై ఒప్పించాడట. బాలయ్య, చిరు, చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించనుండడం, వారు ఏం మాట్లాడుకుంటారో అన్న కుతూహలం మధ్య ఈ షో కు ఇప్పటి నుండే మంచి బజ్ వస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All