Homeటాప్ స్టోరీస్డియ‌ర్ విజ‌య్ మీ ఆవేద‌నను అర్థం చేసుకోగ‌ల‌ను!

డియ‌ర్ విజ‌య్ మీ ఆవేద‌నను అర్థం చేసుకోగ‌ల‌ను!

డియ‌ర్ విజ‌య్ మీ ఆవేద‌నను అర్థం చేసుకోగ‌ల‌ను!
డియ‌ర్ విజ‌య్ మీ ఆవేద‌నను అర్థం చేసుకోగ‌ల‌ను!

కొన్ని వెబ్ సైట్ల అత్యుత్సాహం చిలికి చిలికి వివాదంగా మారుతోంది. ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఓ నాలుగు వెబ్ సైట్లు విష‌యం చిమ్మిన విష‌యం తెలిసిందే. దీనిప‌సై ఇండ‌స్ట్రీ అంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

నిరుత్సాహ‌ప‌డొద్ద‌ని సూచించిన మెగాస్టార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ట్వ‌ట్ చేశారు. వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను వార్త‌లుగా మార్చొద్ద‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి జ‌ర్న‌లిస్టుల‌ని కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. డియ‌ర్ విజ‌య్ మీ ఆవేద‌న నేను అర్థం చేసుకోగ‌ల‌ను. బాధ్య‌త‌లేని రాత‌ల వ‌ల్ల మీలా నేను, నా కుటుంబం బాధ‌ప‌డిన సంద‌ర్భాలు చాలా వున్నాయి. మేము మీకు అండ‌గా నిలుస్తాం. మంచి చేయాల‌నుకుంటున్న మీరు నిరుత్సాహ‌ప‌డొద్దు. వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను వార్త‌లుగా మార్చొద్ద‌ని జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను` అని ట్వీట్ చేశారు.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విజ‌య్ దేవ‌ర‌కొండ మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై కొన్ని వెబ్ సైట్లు విషం చిమ్మ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా మారింది. దీనిపై ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ అంతా ఆగ్ర‌హంతో ఆ నాలుగు వెబ్ సైట్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బ‌హిరంగంగా కోరుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All