Homeటాప్ స్టోరీస్కమ్మ‌నైన మ‌న‌సున్న ప్ర‌తి త‌ల్లి అమ్మే

కమ్మ‌నైన మ‌న‌సున్న ప్ర‌తి త‌ల్లి అమ్మే

కమ్మ‌నైన మ‌న‌సున్న ప్ర‌తి త‌ల్లి అమ్మే
కమ్మ‌నైన మ‌న‌సున్న ప్ర‌తి త‌ల్లి అమ్మే

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏ క్ష‌ణాన మొద‌లైందో గానీ వాట్సాప్, ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్, టిక్ టాక్‌.. అని తేడా లేకుండా అన్నింటిలోనూ ఫేక్ న్యూస్ హ‌వా మొద‌లైంది. న‌మ్మే స్థాయిలో అస‌లేంటో న‌కిలీ ఏంటో తెలుసుకోలేని స్థాయిలో కొంత మంది షాడిస్టులు ఫేక్ వార్త‌లు సృష్టిస్తూ వాటిని రియ‌ల్ న్యూస్‌కి మించిన స్థాయిలో వైర‌ల్ చేస్తున్నారు.

ఆ వార్త‌ల్ని ప్ర‌చార మాధ్య‌మాలు కూడా న‌మ్మి ప్ర‌చురించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సాక్ష్యాత్తు చిరంజీవి త‌ల్లి మాస్కులు కుట్టి పంచి పెడుతోందంటూ ప్ర‌చారం మొద‌లలు పెట్టారు. ఇది నిజ‌మ‌ని న‌మ్మి నో వార్తా ప‌త్రిక ఓ వార్త‌ని ప్ర‌చురించి బ‌క‌రా అయిపోయింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. `కొన్ని వార్తా ప‌త్రిక‌లు, టీవీ ఛాన‌ల్స్ మా అమ్మ మాస్కులు కుట్టి పంచిపెడుతోందంటూ వార్త‌ల్ని ప్ర‌చురించాయి. వాటిపై క్లారిటీ ఇస్తున్నాను అమె మా అమ్మ కాదు అన్నారు.

- Advertisement -

అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో తోటి వారి కోసం స‌మాజ సేవ కోసం ఈ ప‌ని చేస్తున్న ఆ అమ్మ‌కు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.  క‌మ్మ‌నైన మ‌న‌సున్న స్ర‌తి త‌ల్లి అమ్మే` అంటూ ట్వీట్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All