Homeగాసిప్స్భోళా శంకర్ ను హోల్డ్ లో పెట్టారా?

భోళా శంకర్ ను హోల్డ్ లో పెట్టారా?

భోళా శంకర్ ను హోల్డ్ లో పెట్టారా?
భోళా శంకర్ ను హోల్డ్ లో పెట్టారా?

మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా మొత్తంగా మూడు ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. అప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన మలయాళం రీమేక్ లూసిఫెర్ కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు. బాబీ దర్శకత్వంలో ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించారు.

మెహర్ రమేష్ తో సినిమా అనగానే అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మెహర్ రమేష్ దర్శకత్వం చేపట్టక చాలా కాలమే అయింది. పైగా మెహర్ దర్శకత్వం వహించిన చిత్రాలు అన్నీ కూడా దారుణమైన ప్లాప్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఎలా ఛాన్స్ ఇచ్చాడా అని అనుకున్నారు.

- Advertisement -

ఏదైతేనేం టైటిల్ తో, ఫస్ట్ లుక్ తో ఆసక్తి అయితే రేకెత్తించగలిగాడు మెహర్ రమేష్. కాకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్లు తెలుస్తోంది. మెహర్ నరేట్ చేసిన ఫైనల్ డ్రాఫ్ట్ చిరంజీవికి అంతగా ఎక్కలేదట. దీంతో చిరు ప్రస్తుతానికి భోళా శంకర్ ను హోల్డ్ లో పెట్టమన్నాడట. ఆ ప్లేస్ లో బాబీ చిత్రాన్ని ముందుకు తెచ్చాడట. ఈ ఏడాది లోగా ఫైనల్ డ్రాఫ్ట్ తో మెహర్ మెప్పించగలిగితే వచ్చే ఏడాది మొదటి నుండి ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All