Homeటాప్ స్టోరీస్మహేష్ రిలీజ్ ఫంక్షన్ లో.. చిరు సినిమా సంగతులు

మహేష్ రిలీజ్ ఫంక్షన్ లో.. చిరు సినిమా సంగతులు

మహేష్ రిలీజ్ ఫంక్షన్ లో.. చిరు సినిమా సంగతులు
మహేష్ రిలీజ్ ఫంక్షన్ లో.. చిరు సినిమా సంగతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న అంగరంగవైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ ఫంక్షన్ లో చిరు చాలా సందడిగా కనిపించాడు. అటు సరిలేరు నీకెవ్వరు గురించి పొగుడుతూ, అటు మరికొన్ని ఆసక్తికర సంగతుల గురించి కూడా చర్చించాడు. విజయశాంతితో తనకొచ్చిన గ్యాప్ గురించి కూడా ఓపెన్ గా చెప్పిన చిరు ఈ ఫంక్షన్ వేదికగా మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇదంతా మహేష్ వల్లే అయిందని కొనియాడాడు.

ఇక సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కు నన్ను పిలిచినప్పుడు షూటింగ్ అప్పుడే అయిపోయిందా అని షాక్ అయ్యాను. ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు ఫినిష్ చేసారో కూడా అర్ధంకాలేదు. అందరు దర్శకులు ఇలానే ఉండాలి. అప్పుడే నలుగురికి ఉపాధి దొరుకుతుంది. సినీ పరిశ్రమ కూడా చల్లగా ఉంటుంది. థియేటర్లు కళకళలాడతాయి అని అభిప్రాయపడ్డాడు. అలాగే తన సినిమా గురించి కూడా ప్రస్తావించాడు.

- Advertisement -

కొరటాల శివ కూడా తన సినిమాను 99 రోజుల్లో పూర్తి చేస్తాను అని మాట ఇచ్చిన సంగతి రివీల్ చేసాడు. సరిలేరు షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మరి మన సంగతి ఏంటి అని శివను అడిగితే.. సాధారణంగా 130-140 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తాడు శివ.. కానీ నేను టైం టు టైం వచ్చే హీరోను అని చెప్పి 99 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తాను అని మాట ఇచ్చాడు. శివా.. 99 దాటి ఒక్క రోజు అయినా మర్యాద ఉండదు అని సరదాగా వ్యాఖ్యానించాడు. వెంటనే శివ కూడా చేయి కలిపి కచ్చితంగా మాట ఇస్తున్నా సార్ అని వ్యాఖ్యానించాడు.

ఇదంతా ప్రేక్షకులకు కనువిందుగా నిలిచింది. చిరంజీవి – కొరటాల శివ సినిమా షూటింగ్ మూడు రోజుల క్రితం మొదలైన సంగతి తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All