Homeటాప్ స్టోరీస్ఆ సీక్వెన్స్ ఆచార్య సినిమాకే హైలైట్ అంటున్నారే!

ఆ సీక్వెన్స్ ఆచార్య సినిమాకే హైలైట్ అంటున్నారే!

ఆ సీక్వెన్స్ ఆచార్య సినిమాకే హైలైట్ అంటున్నారే!
ఆ సీక్వెన్స్ ఆచార్య సినిమాకే హైలైట్ అంటున్నారే!

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తను చేస్తోన్న నెక్స్ట్ సినిమా ఆచార్య సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లను విడుదల చేసారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక మోషన్ పోస్టర్ లో మణిశర్మ అందించిన నేపధ్య సంగీతానికి అదిరిపోయే లెవెల్లో రెస్పాన్స్ వస్తోన్న విషయం తెల్సిందే.

అయితే ఈ మోషన్ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో ధర్మస్థలి అన్న బోర్డు ఉన్న దగ్గర చిరంజీవి ఆవేశంగా కత్తి పట్టుకుని కనిపిస్తున్నాడు. ఎదురుగా శత్రు మూకలు ఉన్నా చిరు వారందరినీ మట్టుబెట్టేలానే ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ లో ప్రధానమైనదిగా తెలుస్తోంది. చిరంజీవిలో మునుపెన్నడూ చూడని ఉగ్రరూపం ఈ ఎపిసోడ్ లో కనిపిస్తుందట. ఇప్పటికే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను కంప్లీట్ చేసారని సమాచారం.

- Advertisement -

ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తైన ఆచార్య వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ అక్టోబర్ నుండి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ కాగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు నిర్మాతలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All