Homeటాప్ స్టోరీస్లాక్ డౌన్ వేళ గొప్ప మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్‌!

లాక్ డౌన్ వేళ గొప్ప మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్‌!

లాక్ డౌన్ వేళ గొప్ప మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్‌!
లాక్ డౌన్ వేళ గొప్ప మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్‌!

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఎక్క‌డి వారు అక్క‌డే ఇళ్ల‌ల్లో వుండిపోయారు. క‌రోనాని క‌ట్ట‌డి చేయాలంటే ఇళ్ల‌ల్లో వుండాల్సిందే అంటూ కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. దీనికి సెల‌బ్రిటీలు మేము సైతం అంటూ ముందుకు వ‌చ్చి ప్ర‌భుత్వానికి త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తున్నారు.

ఈ క‌ష్ట కాలంలో మెగాస్టార్ చిరంజీవి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. త‌న అభిమాని నాగ‌ల‌క్ష్మి హార్ట్ ఆప‌రేష‌న్ కోసం త‌న వంతు బాధ్య‌త‌గా స‌హాయ స‌హ‌కారాలు అందించారు. స్టార్ హాస్పిట‌ల్‌లో నాగ‌ల‌క్ష్మికి హార్ట్ ఆప‌రేష‌న్ విజ‌వంతంగా పూర్త‌యింది. డాక్ల‌ర్ గోపీచంద్ గారి ఆధ్వ‌ర్యంలో స‌ర్జ‌రీ విజ‌య‌వంతం అయింద‌ని తెలిసింది. నాగ‌ల‌క్ష్మికి జ‌రిగిన ఆప‌రేష‌న్ గురించి హీరో చిరంజీవి ఎప్ప‌టి క‌ప్పుడు స‌మాచారం తెలుసుకుంటూనే వున్నార‌ట‌.

- Advertisement -

ఈ సంద‌ర్బంగా చిరంజీవి మాట్లాడుతూ ` డాక్ట‌ర్ గోపీచంద్ గానికి ..వాళ్ల బృందానికి అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామినాయుడికి, హైద‌రాబాద్ రావ‌డానికి ఏర్పాట్లు చేసిన బి.దిలీప్ గారికి. ఇంత దూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకు. అలాగే ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను`అన్నారు. ‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All