Homeటాప్ స్టోరీస్నటుడిగా 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చిరంజీవి

నటుడిగా 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చిరంజీవి

నటుడిగా 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చిరంజీవి
నటుడిగా 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరే ఒక బ్రాండ్. కోట్లాది మంది అభిమానులను తన ఒక్క పిలుపుతో కదిలించగల గొప్ప వ్యక్తి చిరంజీవి. నటుడిగా చిరంజీవికి పేరు పెట్టడానికి అంటూ ఏం లేదు. చేయని పాత్ర కూడా లేదు. నటుడిగా 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు చిరంజీవి. ఆగస్ట్ 22న తాను పుడితే సెప్టెంబర్ 22న తనలోని నటుడు పుట్టాడని చిరంజీవి అంటున్నాడు. 40 ఏళ్ల క్రితం చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు ఈరోజే విడుదలైంది.

“మీ అందరికీ నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందిన రోజు. నేను మరిచిపోలేని రోజు. లక్షల మంది నా తమ్ముళ్ల, చెల్లెళ్ళ అనంతమైన ప్రేమ పొందడం ఈరోజుతో ప్రారంభమైంది” అని చిరంజీవి ట్వీట్ చేసాడు.

- Advertisement -

ఆ రోజు నుండి మొదలుకుని చిరంజీవి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసాడు. ఈ 40 ఏళ్లలో 153 సినిమాలు చేసాడు చిరంజీవి. ఇప్పటికీ చెరగని చిరునవ్వు, తరగని చార్మింగ్ తో చిరు దరహాసంతో ముందుకు సాగుతున్నాడు చిరంజీవి. ఇలాగే మరిన్ని సంవత్సరాలు మనల్ని అలరిస్తాడని ఆశిద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All