
అక్కినేని నాగ చైతన్య నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం మొత్తానికి సెప్టెంబర్ 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 19న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. లవ్ స్టోరీ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్ గా చేసింది. ఫిదా తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు లవ్ స్టోరీ ప్రోమోలు అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఇక పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నాలుగు పాటలు విడుదలవ్వగా అన్నీ కూడా టాప్ లో ట్రెండ్ అయ్యాయి.
ఇక లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరింత మంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు.