Homeటాప్ స్టోరీస్క‌లెక్ష‌న్‌కింగ్‌తో మెగాస్టార్ సిక్కిం టూర్‌!

క‌లెక్ష‌న్‌కింగ్‌తో మెగాస్టార్ సిక్కిం టూర్‌!

క‌లెక్ష‌న్‌కింగ్‌తో మెగాస్టార్ సిక్కిం టూర్‌!
క‌లెక్ష‌న్‌కింగ్‌తో మెగాస్టార్ సిక్కిం టూర్‌!

టాలీవుడ్‌లో వున్న సీనియ‌ర్ హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు, మెగాస్టార్ చిరంజీవి. వీరిద్ద‌రి మ‌ధ్య అప్ప‌ట్లో మ‌న‌స్ప‌ర్థ‌లు తారా స్థాయికి చేరిన సంద‌ర్బాలూ వున్నాయి. ఆ త‌రువాత వీరి మ‌ధ్య ఏర్ప‌డిన విభేధాలు టీ క‌ప్పులో తుఫానులా తొల‌గిపోవ‌డంతో చాలా కాలం క్రిత‌మే ఈ ఇద్దరూ క‌లిసిపోయారు. ఆ మ‌ధ్య పార్క్ హ‌య‌త్ హోట‌ల్ లో జ‌రిగిన మా ప్రెస్ మీట్‌లో త‌మ మ‌ధ్య వున్న పొర‌పొచ్చాలు స‌మసిపోయాయ‌ని వ్య‌క్తం చేసి ఒక‌రంటే ఒక‌రికి ప్ర‌త్యేకమైన అభిమానం అని చాటుకున్నారు.

అందుకు పంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేశాయి కూడా. తాజాగా ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రెండ్స్ వీకెంట్ స‌ర‌దా కోసం సిక్కింకి ట్రిప్‌కి వెళ్లారు. ఈ విష‌యాన్ని మోహ‌న్‌బాబు కుమార్తె మంచు ల‌క్ష్మి ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఇద్దరు మాస్ట్రోలు సిక్కింకు వీకెండ్‌ పర్యటన కోసం వెళ్ళిళ్లారు. అఇదొక‌ ఫైర్ న్యూస్ అని మీకు తెలుసు. ప‌ర్య‌ట‌న కోసం నాన్న‌ను ఒప్పించగలిగారు.

- Advertisement -

ఇందుకు నేను చాలా అసూయపడుతున్నాను. మీ ఇద్దరికీ మంచి సమయం దొరికినందుకు చాలా ఆనందంగా వుంది. గుండె నిండింది! పిల్లలు ఏదో ఒక రోజు మీతో పాటు ట్రిప్‌కి వెళ్దాం` అని చిరు, మోహ‌న్‌బాబుకు సంబంధించిన ఓ ఫొటోని అభిమానుల‌తో పంచుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All