Homeటాప్ స్టోరీస్పండగ రోజే ముహూర్తం

పండగ రోజే ముహూర్తం

chiranjeevi-and-koratala-siva
chiranjeevi-and-koratala-siva

కొణిదెల చిరంజీవి గారు…… చిరంజీవి గారు అనడం కంటే ‘సైరా నరసింహా రెడ్డి’ అని పిలవచ్చు ఇప్పటినుండి. 151 సినిమా చేసిన రచ్చ అంత ఇంత కాదు. మొదటి సారి ‘సురేందర్ రెడ్డి’ తో కలిసి చేస్తున్న ఈ సినిమా మీద విడుదల కి ముందు దర్శకులు మీద అందరికి కూసింత అనుమానం ఉంది. అలాంటిది చిరంజీవి గారిని ఒక పెద్ద స్థాయి లో చూపించి సురేందర్ రెడ్డి మంచి మార్కులు పొందాడు.

ఇప్పుడు ‘కొరటాల శివ‘ వంతు వచ్చింది. కొరటాల శివ పేరు చెప్పగానే వరుసగా నాలుగు హిట్ సినిమాలు మనకి గుర్తొస్తాయి ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గారేజ్’, ‘భరత్ అనే నేను’ సినిమాలు. ఇప్పుడు మన మెగా స్టార్ చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నాడు. కథ ఎప్పుడో సిద్ధం చేసిన శివ గారు సైరా సినిమా ఉండటం వలన చిరంజీవి గారికోసం వెయిట్ చేస్తున్నారు. రేపు ఆ కల నెరవేరబోతోంది.

- Advertisement -

అవును రేపే శివ-చిరు ల సినిమా పూజ కార్కక్రమాలతో లాంఛనంగా ఆఫీస్ లో మొదలు కాబోతుంది. సైరా విజయంలో కూడా క్షణం తీరిక లేకుండా గడిపిన చిరంజీవి గారు సినిమాని వెంటనే మొదలు పెట్టడం చాలా గొప్ప అని అంటున్నారు మెగా అభిమానులు. సినిమాకి నిరంజన్ రెడ్డి మరియు మన హీరో రామ్ చరణ్ వారి సొంత బ్యానెర్లలో నిర్మిస్తున్నారు.

మిగిలిన తారాగణం మరియు ఇతరత్రా విషయాలు రేపు మీడియా ముందు చెప్పొచ్చు అంటున్నారు ఆ సినిమా యూనిట్ వాళ్ళు. చూద్దాం మరి శివ-చిరు ల మూవీ ఏ విధంగా ఉండబోతుందో?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All