
అన్ని చోట్లా నెగటివ్ టాక్ వచ్చిన సాహో చిత్రం నార్త్ లో మాత్రం మంచి వసూళ్లతో అదరగొట్టింది. రివ్యూయర్లు ఈ చిత్రానికి చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. అయితే నార్త్ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 150 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మరోవైపు చిరంజీవి నటించిన సైరా చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హిందీ క్రిటిక్స్ సైతం ఈ చిత్రాన్ని విపరీతంగా పొగిడేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా సైరాకు హిట్ టాక్ వచ్చింది. తొలి రోజు ఈ చిత్రానికి భారీగా వసూళ్లు వచ్చాయి. రెండోరోజు, మూడో రోజు వసూళ్ళలో డ్రాప్ కనిపించింది. మళ్ళీ శనివారం వసూళ్లు పుంజుకున్నాయి. తొలి వారాంతం ముగిస్తే కానీ ఈ సినిమా రేంజ్ ను అంచనా వేయలేం.
ఇదంతా బానే ఉంది కానీ నార్త్ లో మాత్రం సైరా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. సైరా హిందీ వెర్షన్ టోలీ రోజు 2.5 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు సైరా స్థాయి అక్కడ మరింత పడిపోయింది. మూడో రోజు కూడా నెట్ వసూళ్లు కోటికి అటూ ఇటూగా నమోదయ్యాయి. నార్త్ లో దాదాపు 25 కోట్లు బిజినెస్ చేసిన ఈ చిత్రం వీకెండ్ లో ఎంత పుంజుకున్నా కూడా డిజాస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.