Homeటాప్ స్టోరీస్కార్తీ సినిమా కలెక్షన్లు ఇంత దారుణమా

కార్తీ సినిమా కలెక్షన్లు ఇంత దారుణమా

chinna babu shocking collections on first day తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన చినబాబు నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాకు నిన్న షాక్ అయ్యే కలెక్షన్లు వచ్చాయి , రెండు తెలుగు రాష్ట్రాలలో చినబాబు కి వచ్చిన షేర్ ఎంతో తెలుసా ……. ….. 83 లక్షలు . అత్యంత దారుణమైన వసూళ్లు ఇవి . కార్తీ కి ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది అయితే గతకొంత కాలంగా ఈ హీరో నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పొందడంతో వసూళ్లు మందగించాయి .

చినబాబు సినిమా కంటే ముందు వచ్చిన ఖాకీ సినిమా హిట్ అయినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రమే దాంతో కావచ్చు ఈ సినిమాకు అంతగా కలెక్షన్లు రాలేదు . దేనికంటే ముందు విడుదలైన చిన్న సినిమా …… ఏమాత్రం అంచనాలు లేని ” ఆర్ ఎక్స్ 100” చిత్రానికి మొదటి రోజున కోటిన్నర షేర్ రాగా రెండో రోజున కోటి వచ్చింది దాంతో రెండు రోజుల్లోనే రెండున్నర కోట్ల షేర్ వచ్చింది . కానీ స్టార్ హీరో అయినా కార్తీ చిత్రానికి మాత్రం కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాకపోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది కానీ ఎందుకో వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి . ఈరోజు శనివారం , రేపు ఆదివారం కాబట్టి ఈ రెండు రోజులు వసూళ్లు మెరుగు అవుతాయో చూడాలి .

- Advertisement -

నిన్న వసూల్ అయిన వివరాలు ఇలా ఉన్నాయి

నైజాం – 19 లక్షలు
సీడెడ్ – 13 లక్షలు
ఉత్తరాంధ్ర – 11 లక్షలు
ఈస్ట్ – 7 లక్షలు
వెస్ట్ – 6 లక్షలు
కృష్ణా – 7. 6 లక్షలు
గుంటూరు – 16 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
మొత్తం – 0. 83 లక్షలు

English Title: chinna babu shocking collections on first day

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All