
సినిమాల్లో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంత పేరుందో వరుస వివాదాల కారణంగా కాంట్రవర్సీల విషయంలోనూ అంతే పేరుని చిన్మయి సొంతం చేసుకుంది. మహిళా సాధికారత విషయంలో ఎప్పుడూ ముందుంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్‌లు చేస్తే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల వైరముత్తు, రాధా రవి కారణంగా డబ్బింగ్ యూనియన్ నుంచి నిషేధానికి గురైంది కూడా.
వైరముత్తు గత కొంత కాలంగా గాయనిలని మానసికంగా వేధిస్తున్నారని, తన పేరుని అడ్డంపెట్టుకుని కొంత మందితో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని, ఆయనను సినిమా రంగం నుంచి నిషేధించాలని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా తనని ఏ సంఘం అయితే నిషేధించిందో అదే సంఘానికి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతోంది.
తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తనని నిషేధించడానికి ప్రధాన కారకుడైన రాధారవిపైనే చిన్మయి పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఆమె పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సిటీ సివిల్ కోర్ట్ తనని లీగల్‌గా డబ్బింగ్ యూనియన్ మెంబర్‌గా గుర్తించిందని. అలాంటి తనని ఓటు వేయకుండా. పోటీ చేయకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.