Homeటాప్ స్టోరీస్చావు క‌బురు చ‌ల్ల‌గా చెబుతుంద‌ట‌!

చావు క‌బురు చ‌ల్ల‌గా చెబుతుంద‌ట‌!

చావు క‌బురు చ‌ల్ల‌గా చెబుతుంద‌ట‌!
చావు క‌బురు చ‌ల్ల‌గా చెబుతుంద‌ట‌!

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నేడు హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం లావ‌ణ్య బ‌ర్త్‌డే పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక అనే హైద‌రాబాదీ బ‌స్తీ అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో లావ‌ణ్య చిరున‌వ్వులు చిందిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. సొట్ట బుగ్గ‌ల‌తో స్వ‌చ్ఛ‌మైన చిరున‌వ్వుతో క‌నిపిస్తున్న లావ‌ణ్య స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ మూవీతో లావ‌ణ్య ఖ‌చ్చితంగా హిట్ ని త‌న ఖాతాలో వేసు కోవ‌డం గ్యారంటీగా క‌నిపిస్తోంది.

- Advertisement -

ఇదిలా వుంటే ఇందులో హీరో కార్తికేయ బ‌స్తీ బాల‌రాజుగా మాసీవ్ పాత్ర‌లో ఆక‌ట్టుకోబోతున్నాడు. శ‌వాల‌ని స్మ‌శానానికి పంపించే వాహ‌నానికి డ్రైవ‌ర్‌గా కార్తికేయ భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇందులో చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పేది ఎవ‌రు? మ‌ల్లిక పాత్ర‌కు బ‌స్తీ బాల‌రాజు పాత్ర‌కున్న సంబంధం ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ విడుద‌ల‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All