
త్రిష.. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు 15 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా తన సత్తాని చాటుకున్న త్రిష ఇప్పటికీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 ఏళ్లవుతోంది. గత కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాలకు దూరంగా వుంటున్న ఆమె మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ హీరోయిజం వున్న పాత్రలకు ప్రాధాన్యతనిస్తోంది.
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న త్రిష ఇటీవలే తన 38వ పుట్టిన రోజు వేడుకల్ని నిరాడంబరంగా జరుపుకుంది. కోవిడ్ కారణంగా చెన్నైలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు సంబరాల్లో మునిగిపోయింది. ఆమెతో సన్నిహితంగా వుండే హీరోయిన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, హీరోలు త్రిషకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే టాలీవుడ్ ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ చార్మింగ్ లేడీ చార్మీ మాత్రం త్రిషకు సరికొత్తగా బర్త్‌డే విషెస్ చెప్పింది. ఇదే తన చివరి బ్యాచిలర్ బర్త్‌డే అని, త్వరలోనే తను వివాహం చేసుకోబోతోందని ఇండైరెక్ట్‌గా చెప్పేసి త్రిష పెళ్లి సీక్రెట్‌ని బయటపెట్టేసింది. దీంతో చార్మి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చార్మి గతంలో త్రిషతో కలిసి `పౌర్ణమి` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. …