Homeటాప్ స్టోరీస్చార్మీ  కౌగిట్లో రౌడీ హీరోయిన్ బందీ!

చార్మీ  కౌగిట్లో రౌడీ హీరోయిన్ బందీ!

charmi hugs heroine ananya pandy
charmi hugs heroine ananya pandy

కొంత మందికి ఆనందం వ‌చ్చినా.. దుఃఖం వ‌చ్చినా ప‌ట్టుకోలేం. అయితే క్రేజీ లేడీ, డేరింగ్ ప్రొడ్యూస‌ర్  చార్మికి ఆనందం వ‌స్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. శుక్ర‌వారం అదే జ‌రిగింది. త‌న సినిమాలో న‌టిస్తున్నబాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండేని త‌న కైగిట్లోబందీని చేసింది. అన‌న్య పుట్టిన రోజు కావ‌డంతో త‌న‌కు ఈ ర‌కంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల్ని అంద‌జేసింది.

అన‌న్య‌ని చార్మీ హ‌గ్ చేసుకున్న ఫొటో సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. ఆ ఫొటోకి ఆస‌క్తిక‌రంగా కామెంట్ చేసింది కూడా . పుట్టినరోజు శుభాకాంక్షలు నా మధురమైన అన‌న్య పాండే. నువ్వు ఏమి చేసినా చాలా అద్భుతమైన ఉత్సాహంతో వైబ్ కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ అదే జోష్‌తో ప్రకాశిస్తూ ఉండాలి` అని కామెంట్ చేసింది.

- Advertisement -

పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ `ఫైట‌ర్‌` విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్నారు. చార్మి, క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ‌మెహ‌తా, పూరి సంయుక్తంగా నిర్మ‌స్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ మాట్ గాళ్ అన‌‌న్య పాండే హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All