HomePolitical Newsబతికుండగానే NTRని చంపేసిన చంద్రబాబు ?

బతికుండగానే NTRని చంపేసిన చంద్రబాబు ?

బతికుండగానే NTRని చంపేసిన చంద్రబాబు ?
బతికుండగానే NTRని చంపేసిన చంద్రబాబు ?

టీడీపీ నేతలపై మరోసారి పంచ్‌లు విసిరారు మంత్రి రోజా. బతికుండగానే NTRని చంపేసిన చంద్రబాబుకు సీఎం జగన్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. కోర్టులో గెలిచామని రాజధాని రైతులు సంబర పడుతున్నారని రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికే పాదయాత్రలు చేస్తున్నారన్నారు. రైతులెక్కడైనా వాకీటాకీలు, ఐఫోన్ వాచ్‌లు పెట్టుకొని తొడలు కొడతారా అని కౌంటర్‌ ఇచ్చారు.

బాలయ్య.. ప్లూటు బాబు ముందు ఊదు.. జ‌గ‌న్ ముందు కాదు.. అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జ “గన్” అనే రియల్ సింహం… తేడా వస్తే దబిడి దిబిడే.. అంటూ మంత్రి రోజా నందమూరి బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ వర్సిటీ పేరు మార్చి.. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా ప్రకటించారు. అప్పటినుంచి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఎంట్రీతో అది పీక్స్‌కు చేరింది.

- Advertisement -

వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని.. నందమూరి కుటుంబం ఖండించింది. ఈ అంశంపై బాలకృష్ణ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అక్కడ ఆ మహానీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారని మండిపడ్డారు. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులంటూ బాలయ్య తన సోషల్ మీడియా పోస్ట్‌లో హాట్ హాట్ కామెంట్స్ చేశారు. వీటిపైనా వైసీపీ భగ్గుమన్నారు. అంబటి రాంబాబు మొదలు ఆర్కే రోజా వరకు అందరూ కౌంటర్లు ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All