Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కు ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు

ఎన్టీఆర్ కు ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు

Chandrababu naidu special permission for extra shows to ntr యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నాడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈనెల 11న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి దానికి తోడు దసరా ఉత్సవాలలో విడుదల అవుతున్న సినిమా కాబట్టి అరవింద సమేత చిత్రానికి అదనంగా 2 ఆటలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అంటే ఆంధ్రప్రదేశ్ లో అరవింద సమేత చిత్రానికి నాలుగు ఆటలు కాకుండా 6 ఆటలు ఉంటాయన్న మాట రోజుకి ! ఈనెల 11 నుండి 18 వరకు ఈ అనుమతి మంజూరు చేశారు చంద్రబాబు నాయుడు.

- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా లు నటించారు. దసరా పండుగ కాబట్టి అరవింద సమేత చిత్రం భారీ వసూళ్లు సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. దానికి తోడు ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేక అనుమతి లభించడం వల్ల అదనంగా మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయం. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కాబట్టి కాస్త బాగున్నా రికార్డ్ ల మోత మోగడం ఖాయం. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ దసరా ని ఎన్టీఆర్ కుమ్మేయడం ఖాయమని నందమూరి అభిమానులు సంతోషంగా ఉన్నారు.

English Title: Chandrababu naidu special permission for extra shows to ntr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts