Homeటాప్ స్టోరీస్ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఎవరో తెలుసా

ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఎవరో తెలుసా

chandrababu naidu happy with lagadapati rajagopal surveyఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ అధికార పీఠాన్ని అందుకునేది తెలుగుదేశం పార్టీ అని తాజా సర్వే చెబుతోంది . సర్వే లలో మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ సర్వే ని ఎక్కువ శాతం మంది నమ్ముతారు ఎందుకంటే అతడు ఇప్పటివరకు చేసిన అన్ని సర్వే ఫలితాలు నిజమయ్యాయి అంతేకాదు చెప్పిన ఫిగర్ కూడా దాదాపుగా మ్యాచ్ అవుతూనే ఉంది . తాజాగా లగడపాటి ఆంధ్రప్రదేశ్ లో చేసిన సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 110 సీట్లతో మళ్ళీ అధికారం అందుకోవడం ఖాయమని , జగన్ పార్టీ 60 సీట్లకే పరిమితం కానుందని తేల్చి పడేసాడు లగడపాటి .

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కొంత వరకు ఓట్ల శాతం సంపాదించుకున్నాడు కానీ సీట్లు మాత్రం పెద్దగా రావడం లేదు . వస్తే గిస్తే 5 సీట్లు వస్తాయట పవన్ కళ్యాణ్ కు . ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా తెలుగుదేశం కు 110 , జగన్ పార్టీ కి 60 , ఇతరులు 5 స్థానాలు గెల్చుకుంటారని లగడపాటి రాజగోపాల్ సర్వే లో తేలింది . అయితే ఈ సర్వే ఇలా ఉండగా జనాల్లో మాత్రం జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని , చంద్రబాబు అధికారం కోల్పోవడం ఖాయమని అంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All