Homeటాప్ స్టోరీస్డ్ర‌గ్స్ కేసులో మొత్తానికి సంజ‌న అరెస్ట్‌!

డ్ర‌గ్స్ కేసులో మొత్తానికి సంజ‌న అరెస్ట్‌!

డ్ర‌గ్స్ కేసులో మొత్తానికి సంజ‌న అరెస్ట్‌!
డ్ర‌గ్స్ కేసులో మొత్తానికి సంజ‌న అరెస్ట్‌!

క‌న్న‌డ చిత్ర సీమ‌ని డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే న‌టి రాగిణి దివ్వేదీని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు తాజాగా మంగ‌ళ‌వారం మ‌రో న‌టి సంజ‌న గ‌ల్రానీని అదుపులోకి తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం బెంగ‌ళూరులోని ఇందిరాన‌గ‌ర్‌లో వున్న సంజ‌న నివాసంలో సోదాలు నిర్వ‌హించిన పోలీసులు కోర్టు ఆదేశాల మేర‌కు ఆమెని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని సీసీబీ పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు. న్యాయ స్థానం నుంచి సెర్చ్ వారెంట్ పొందిన త‌రువాతే సంజ‌న ఇంట్లో సోదాలు జ‌రిపామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని పోలీస్ అధికారి సందీప్ పాటిల్ వెల్ల‌డించారు. ్ర‌గ్స్ కేసులో సంజ‌న స్నేహితుడు రాహుల్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ త‌రువాత త‌మ దృష్టిని సంజ‌న వైపు మళ్లించారు.

- Advertisement -

డ్ర‌గ్స్ వాడ‌కం, అక్ర‌మ ర‌వాణా వంటి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే సీసీబీ పోలీసులు 13 మందిపై కేసులు న‌మోదు చేయ‌గా అందులో 6 గురిని అరెస్ట్ చేయ‌డం, అందులో రాగిణి దివ్వేది, సంజ‌న గ‌ల్రానీ లాంటి హీరోయిన్‌లు వుండ‌టం క‌న్న‌డ నాట తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All