Homeటాప్ స్టోరీస్డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. సెక్సీ న‌టి అరెస్ట్!

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. సెక్సీ న‌టి అరెస్ట్!

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. సెక్సీ న‌టి అరెస్ట్!
డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. సెక్సీ న‌టి అరెస్ట్!

బాలీవుడ్ హీరో మ‌ర‌ణం త‌రువాత తీగ లాగితే క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ డొంక క‌దులుతోంది. గ‌త కొన్ని రోజులుగా క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన సంగీత ద‌ర్శ‌కులుకు. సెల‌బ్రిటీల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ముఠాని బెంగ‌ళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో పోలీసులు మ‌రింతగా డ్ర‌గ్స్ కేసులో కీల‌కంగా ఎవ‌రున్నారో ఆరాతీయ‌డం మొద‌లుపెట్టారు. తాజాగా క‌న్న‌డ సెక్సీన‌టి రాగిని దివ్వేదీని డ్ర‌గ్స్ కేసులో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

దీంతో క‌న్న‌డ చిత్ర సీమ‌లో తీవ్ర క‌ల‌క‌లం మొద‌లైంది. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జిత్ లంకేష్‌తో పాటు ప‌లువురి పేర్లు బ‌య‌టికి రావ‌డంతో సీసీబీ పోలీసులు సోదాల్ని ముమ్మ‌రం చేశారు. శుక్ర‌వారం ఉద‌యం రాగిణి ద‌వ్వేది నివాసానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. సెర్చ్ వారెంట్ వుండ‌టంతో రాగిణి ఇంట్లో అనువ‌ణువు గాలించారు.

- Advertisement -

ఈ కేసులో బుధ‌వార‌మే నోటీసులు అందుకున్న న‌టి రాగిణి దివ్వేది త‌న లాయ‌ర్ స‌హ‌కారంలో సోమ‌వారం పోలీసుల ఎదురుట హాజ‌ర‌వుతాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్ప‌ష్టం చేసింది. అయితే అందుకు అంగీక‌రించ‌ని పోలీసులు శుక్ర‌వార‌మే ఆమెని అదుపులోకి తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసులో రాగిని స‌న్నిహితుడిని సీసీబీ పోలీసులు బుధ‌వార‌మే అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని ఐదు రోజుల పాటు పోలీసు క‌ష్ట‌డీకి అప్ప‌గిస్తూ కోర్టు తీర్పుని వెలువ‌రించింది. దీంతో క‌న్న‌డ నాట హై అల‌ర్ట్ ఏర్ప‌డింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All