
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎస్. రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లే లైతేతో పాటు కేథరిన్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. విభిన్నమైన కథగా వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరియ14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఇదిలా వుంటే ఈ చిత్రంతో నటించిన కేథరిన్ బాలయ్య 106వ చిత్రాన్ని అంగీకరించిందని వార్తలు వినిపించాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా సినిమాకు పూజా కార్యక్రమాలు జరిపారు. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు కూడా. బాలయ్యకు జోడీగా ఇద్దరు హీరోయిన్‌లని అనుకున్నారు. అందులో ఓ హీరోయిన్‌గా కేథరిన్‌ని ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి కేథరిన్ తప్పుకుందని తెలుస్తోంది. కారణం ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆమె స్థానంలో బాలీవుడ్ భామని కథానాయికగా ఎంపిక చేయాలని దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. ఆమె స్థానంలో ఎవరిని దించేస్తారన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.