Homeగాసిప్స్తమిళ హీరోలను చూసి మనవాళ్ళు నేర్చుకుంటారా!

తమిళ హీరోలను చూసి మనవాళ్ళు నేర్చుకుంటారా!

తమిళ హీరోలను చూసి మనవాళ్ళు నేర్చుకుంటారా!
తమిళ హీరోలను చూసి మనవాళ్ళు నేర్చుకుంటారా!

ఏ విషయం జరిగినా అందులో మంచి, చెడు రెండూ ఉంటాయంటారు. అలాగే తెలుగు సినిమాకు బాహుబలి రావడం వల్ల మంచే ఎక్కువ జరిగినా కొంత చెడు కూడా ఉంది. బాహుబలి లాంటి సినిమా తెలుగులో తెరకెక్కడం వల్ల తెలుగు సినిమాకు గౌరవం పెరిగింది. తెలుగు సినిమాను అందరూ గౌరవించడం మొదలుపెట్టారు. ప్రభాస్, రానా, అనుష్క వంటి వారికి హిందీలో అమితమైన గుర్తింపు లభించింది. మరి చెడు ఏం జరిగింది? తెలుగు సినిమా ఖ్యాతి పెరగడంతో అది చూసిన మిగతా ఫిల్మ్ మేకర్స్ తాము కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలని కలలు కనడం మొదలుపెట్టారు. ఇందులో తప్పేం లేదు కానీ ఎలాంటి సినిమాను ప్యాన్ ఇండియా చేయాలో ఆలోచించాలి. తాము ఎంచుకున్న కథ ప్యాన్ ఇండియా రీచ్ ఉంటుందో లేదో సరిగ్గా అంచనా వేయగలగాలి. అప్పుడే సినిమాను నిర్మించాలి. అది లేకుండా ప్రతీ కథను ప్యాన్ ఇండియా రీచ్ తో తెరకెక్కించాలి అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా రీచ్ అంటూ తీసిన సాహో, సైరా నరసింహారెడ్డి సినిమాలు దారుణంగా పరాజయం పొందాయి. సాహో నార్త్ లో హిట్టయినా ఇక్కడ పోయింది. నార్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక్కడ సౌత్ ఇండియా అభిరుచికి దూరంగా సినిమాను నిర్మించడమే దీనికి కారణమని అంటున్నారు.

మరోవైపు సైరా నరసింహారెడ్డి తెలుగులో తప్ప మిగతా భాషల్లో దారుణంగా విఫలమైంది. ఒక తెలుగువాడి వీర గాథను ఇండియా లెవెల్లో చెప్పాలని ప్రయత్నించడంతో ఆ ఎమోషన్ కు మిగతా భాషల వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. అందుకే సైరా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినా కానీ ఇంకా ప్యాన్ ఇండియా పిచ్చి తెలుగువాళ్ళకు తగ్గలేదు. మరిన్ని సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో తమిళ హీరోలు చాలా మెరుగ్గా ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది. అక్కడ కూడా బాహుబలిని తలదన్నే సినిమా చేయాలని కొంతమందికి అనిపించినా చాలా మంది ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు.

- Advertisement -

ధనుష్ నే తీసుకుంటే తన సినిమాలు తెలుగులో విడుదలవుతాయి, హిందీలో కూడా రెండు సినిమాలు చేసాడు. అలా అని చెప్పి తన లేటెస్ట్ సినిమా అసురన్ ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయలేదు. ఎందుకంటే ఈ చిత్రం తమిళ నేటివిటీకి అద్దం పడుతూ తెరకెక్కింది. అక్కడి జనాలకు మాత్రమే అర్ధమయ్యే ఎమోషన్ చిత్రంలో మిళితమై ఉంటుంది. దాన్ని ఇండియా వైడ్ గా తీస్తే కచ్చితంగా ప్లాప్ అవుతుంది. అందుకే ధనుష్ ఆ సాహసం చేయలేదు. ముందు సౌత్ ఇండియాలో తన బేస్ స్ట్రాంగ్ చేసుకోవాలని భావిస్తున్నాడు.

అలాగే విజయ్ కూడా, తలుచుకుంటే తన సినిమాను ప్యాన్ ఇండియా రిలీజ్ చేయవచ్చు. కానీ బిగిల్ ను తమిళ్ తో పాటు కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేసాడు. భారీ కాన్వాస్ ఉన్న సినిమాను హిందీలో ఆర్భాటాల మధ్య విడుదల చేయవచ్చు కానీ ఇది కూడా అంతే. సౌత్ వాళ్లకు మాత్రమే నప్పుతుంది. అందుకనే కథ ఓకే అయినప్పుడే అది ఎంతవరకూ తీయాలనేది క్లారిటీ ఉండడం మంచిది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All