Homeటాప్ స్టోరీస్బయ్యర్లకి ముంచుతాడా ? లాభాలు ఇస్తాడా ?

బయ్యర్లకి ముంచుతాడా ? లాభాలు ఇస్తాడా ?

Buyers hopes on Vijay's sarkar విజయ్ నటించిన సర్కార్ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . అయితే ఈ సినిమాని భారీ రేట్లకు కొన్నారు బయ్యర్లు . ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు జరిగిన బిజినెస్ 185 కోట్లు అంట ! 185 కోట్ల బిజినెస్ అంటే 300 కోట్ల వసూళ్లు తప్పనిసరిగా రావాల్సిందే , అప్పుడే బయ్యర్లకు షేర్ వస్తుంది …. లాభాలు వస్తాయి . ఇంత రేటు పెట్టి సర్కార్ సినిమాని కొనడానికి కారణం ఏంటో తెలుసా ……… విజయ్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన తుపాకి , కత్తి చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి . దాంతో ముచ్చటగా మూడో చిత్రంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి అందునా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి సర్కార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అందుకే బయ్యర్లు పోటీపడి ఈ సినిమాని కొన్నారు దాంతో బిజినెస్ 185 కోట్లకు చేరింది .

బయ్యర్లకు లాభాలు రావాలంటే ఈ సినిమా ఖచ్చితంగా తక్కువ రోజుల్లోనే 250 కోట్ల నుండి 300 ల కోట్ల వరకు వసూల్ చేయగలగాలి అప్పుడే బయ్యర్లు ఒడ్డున పడతారు లేదంటే నష్టాల్లో మునగడం ఖాయం . విజయ్ కి తమిళనాట అలాగే ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ వస్తాయి . ఇక సినిమా టాక్ బాగుంటే బయ్యర్లకు వచ్చిన నష్టం ఏమి ఉండదు . ఒకవేళ టాక్ బాగోలేకపోతే మాత్రం బయ్యర్లు నష్టపోవడం ఖాయం . మరి విజయ్ బయ్యర్లను ముంచుతడా ? లాభాలు పంచుతాడా అన్నది తెలియాలంటే ఒక వారం రోజులు ఓపిక పట్టాల్సిందే .

- Advertisement -

English Title: Buyers hopes on Vijay’s sarkar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All