Homeటాప్ స్టోరీస్విజయ్ సర్కార్ టాక్ ఎలా ఉందో తెలుసా

విజయ్ సర్కార్ టాక్ ఎలా ఉందో తెలుసా

Vijay's SARKAR premiere show talkతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది . ఇక ఓవర్ సీస్ లో ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి . ఆ ప్రీమియర్ షోల ప్రకారం టాక్ ఎలా ఉందో తెలుసా …….. ఫస్టాఫ్ యావరేజ్ కాగా సెకండాఫ్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాడట దర్శకులు మురుగదాస్ దాంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం కష్టమని , కాకపోతే విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సర్కార్ విపరీతంగా నచ్చడం ఖాయమని అంటున్నారు ఈ సినిమాని చూసిన వాళ్ళు . ఎందుకంటే ఇది వన్ మ్యాన్ షోగా సాగిందని , విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం భలేగా నచ్చుతుందని అంటున్నారు . పాటలు సినిమాలో స్పీడ్ బ్రేకర్ లా వచ్చాయట ! అలాగే విజయ్ స్టైల్ ముందు మిగిలిన నటీనటులు అంతా తేలిపోయారని టాక్ .

ఇక మురుగదాస్ ని కూడా పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అలాగే విమర్శలు కూడా చేస్తున్నారు . ఇక కొంతమంది అయితే సర్కార్ సినిమా కంటే స్పైడర్ సినిమా చాలా బెటర్ అని అంటున్నారు . అయితే ఈ మాటలు అంటున్నది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నది మాత్రం యాంటి ఫ్యాన్స్ అనే విషయం తెలిసిపోతోంది . మొత్తానికి విజయ్ స్టైల్ , యాక్టింగ్ తో ఈ సినిమా పైసా వసూల్ అయ్యేలా ఉందని టాక్ . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సర్కార్ ఫలితం ఎలా ఉండబోతోందో కొద్ది గంటల్లోనే తెలియనుంది .

- Advertisement -

English Title: Vijay’s SARKAR premiere show talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All