Homeటాప్ స్టోరీస్బ‌న్నీ సూప‌ర్ కూల్ లుక్ కేకెహే!

బ‌న్నీ సూప‌ర్ కూల్ లుక్ కేకెహే!

Bunny stylish look goes viral on sociel media
Bunny stylish look goes viral on sociel media

టాలీవుడ్‌కు స్టైల్‌ని, స‌రికొత్త మేన‌రిజ‌మ్స్‌ని అందించింది మెగాస్టార్ చిరంజీవే అయినా దాన్ని మ‌రింత‌గా మోడ్ర‌‌నైజ్ చేసి స‌రికొత్త స్టైల్స్‌ని అందిస్తున్న‌ది మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే అని చెప్ప‌క త‌ప్ప‌దు. టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్‌ని ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాకుండా హీరో క్యారెక్ట‌ర్‌ల‌కు స‌రికొత్త స్టైల్‌ని ఆపాదించి స్టైల్‌కి కేరాష్ అడ్ర‌స్‌గా నిలిచారు బ‌న్నీ. ఆయ‌న త‌న స్టైల్స్‌తో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఫ్యాన్స్‌ని సొంతం చేసు‌కున్నారు.

ప్ర‌తి సినిమా విష‌యంలోనూ ఏదో ఒక భిన్న‌మైన లుక్‌ని స్టైల్‌ని మెయింట‌న్ చేసే బ‌న్నీ తాజా చిత్రం కోసం స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. క‌ర్లింగ్ హెయిర్‌తో బ‌న్నీ క‌నిపిస్తున్న స్టిల్స్ ప్ర‌స్త‌తం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ముత్యం శెట్టి మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తోంది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ మూవీ రూపొంద‌నుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో మార్పులు ఏర్ప‌డిన త‌రువాత మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే `పుష్ప‌` లో బ‌న్నీ ర‌గ్గ్‌డ్ లుక్‌లో ఊర‌మాస్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్‌గా, గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ లుక్ కోసం భారీగా హోయిర్ పెంచిన బ‌న్నీ షూటింగ్ ఆగిపోవ‌డంతో భార్య స్నేహా రెడ్డితో క‌లిసి స‌ర‌దాగా సిటీ ఔట్ స్క‌ర్ట్స్‌లో సంద‌డి చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బ‌న్నీ లుక్‌ని చూసిన వాళ్లంతా సూప‌ర్ కూల్ లుక్ కేకెహే అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All