Homeటాప్ స్టోరీస్డైరెక్ట‌ర్ అవుతున్న డ్యాన్స్ మాస్ట‌ర్ బ్రింద!

డైరెక్ట‌ర్ అవుతున్న డ్యాన్స్ మాస్ట‌ర్ బ్రింద!

డైరెక్ట‌ర్ అవుతున్న డ్యాన్స్ మాస్ట‌ర్ బ్రింద!
డైరెక్ట‌ర్ అవుతున్న డ్యాన్స్ మాస్ట‌ర్ బ్రింద!

క్రేజీ కొరియెగ్రాఫ‌ర్స్ ప్ర‌భుదేవా, రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌కులుగా మారి మెగా హిట్‌ల‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ కోవ‌లో మ‌రో కొరియెగ్రాఫ‌ర్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఆమె మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్‌. టాలీవుడ్‌, కోలీవుడ్ చిత్రాల‌కు క్రేజీ కొరియోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన బ్రింద ద‌ర్శ‌కురాలిగా అరంగేట్రం చేస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, కాజ‌ల్ అగర్వాల్‌, ఆదితీరావు హైద‌రీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

జియో స్టూడియోస్‌, గ్లోబ‌ల్ వ‌న్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభ‌మైంది. త‌మిళ్లంలో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయ‌నున్నారు. తొలి షాట్‌కు సీనియ‌ర్ న‌టి కుష్బూ క్లాప్ నివ్వ‌గా దిగ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని హీరోయిన్ అదితీరావు హైద‌రీ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

- Advertisement -

మ‌ణిర‌త్నం రూపొందించిన `ఓకే క‌న్మ‌ణి` చిత్రంలోని `హేయ్‌ సినామిక‌` అనే పాట‌నే ఈ చిత్రానిక టైటిల్‌గా పెట్టుకోవ‌డం విశేషం. నా ఫేవ‌రేట్ డ్యాన్స్ మాస్ట‌ర్ బ్రిందా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న తొలి చిత్ర‌మిది. నా ఫేవ‌రేట్ పీపుల్స్ మ‌ధ్య మొద‌లైన తొలి రోజు షూటింగ్ ఇది. అంతా ఆశీర్వదిస్తార‌ని ఆశిస్తున్నా` అని అదితీరావు హైద‌రీ ట్వీట్ చేసింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All