HomePolitical Newsశ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అక్టోబర్ 5 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీవారు ఉదయం రాత్రి వివిధ వాహన సేవలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. పెద్దశేషవాహన సేవతో మొదలై శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. కరోనా కార‌ణంగా బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా రెండు సంవత్సరాలు నిర్వహించింది టీటీడీ. ఈ ఏడాది అత్యంత వైభవంగా వాహనసేవలను నిర్వహించాలని టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేసింది.

ఈ ఏదాది ఒకే బ్రహ్మోత్సవం కావడం, రెండు సంవత్సరాల తర్వాత మాడ వీధుల్లో వాహన సేవలను ఊరేగించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేసిన టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షలు చేసి.. ఏర్పాట్లను పరిశీలించారు. స్వామివారి వాహనసేవలు ఊరిగే ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలు, మాడవీధి ప్రవేశ మార్గాలు, మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు సౌకర్యాలలో ఎలాంటి లోపం రాకుండా ఏర్పాట్లు ఉండాలని సంభందిత అధికారులను ఈవో అదేశించారు.

- Advertisement -

అక్టోబర్ 1న బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడవాహనసేవ జరగనుంది. దాదాపు రెండేళ్ల తరువాత 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశేష సంఖ్యలో భక్తుల రద్దీ వచ్చే ఆవకాశం ఉండడంతో, రద్దీకి అనుగుణంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామమన్నారు ఈవో ధర్మారెడ్డి. ఈనెల 27వ తేదీ రాత్రి సీఎం జ‌గ‌న్ శ్రీ‌వారికి పట్టు వ‌స్త్రాల‌ను సమర్పించేందుకు తిరుమలకు రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భదత్ర చర్యలు చేపట్టున్నారు.

ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సమాయత్తమైందన్నారు టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం.. రేపు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని వెల్లడించారు. తిరుమలలో నూతన పరకామణి భవనం ప్రారంభమ‌వుతుంద‌ని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు జరిగాయి. కొండపైకి వచ్చిన వారందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ద‌ర్శన భాగ్యం క‌లిగేలా అధికారుల‌ను ఆదేశించింది టీటీడీ. భక్తుల రద్దీ దృష్ట్యా లడ్డూ కొరత లేకుండా చూస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All