Homeటాప్ స్టోరీస్ఆగస్టు 3న మహేష్ ప్లాప్ చిత్రం బ్రహ్మోత్సవం

ఆగస్టు 3న మహేష్ ప్లాప్ చిత్రం బ్రహ్మోత్సవం

Brahmotsavam Tamil Vs Bhale Bhale Magadivoy Tamil Remake మహేష్ బాబు నటించిన ప్లాప్ చిత్రం బ్రహ్మోత్సవం ఆగస్టు 3న తమిళనాట విడుదల అవుతోంది . తెలుగులో 2016 లో విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది . కట్ చేస్తే ఆ సినిమాని ఇప్పుడు తమిళనాట ” అనిరుద్ ” పేరుతో విడుదల చేస్తున్నారు . మహేష్ సరసన ముగ్గురు భామలు సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత లు నటించారు . సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు కాగా రెండేళ్ల తర్వాత మహేష్ నటించిన ప్లాప్ చిత్రాన్ని తమిళ్ లో విడుదల చేస్తుండటం గమనార్హం .

ఈ సినిమాకు పోటీగా అదే రోజున తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మగాడివోయ్ చిత్రం తమిళ్ లో రీమేక్ అయ్యింది ఇక ఆ సినిమా పేరు ఏంటో తెలుసా ….. గజినీకాంత్ . తమిళ హీరో ఆర్య నటించిన గజినీకాంత్ ని కూడా ఆగస్టు 3న విడుదల చేస్తున్నారు . తమిళ్ లో ఆర్య స్టార్ హీరో అన్నట్లే ! అయితే అక్కడ మహేష్ కు ఆర్య స్థాయిలో మార్కెట్ లేదు కాకపోతే సమంత , కాజల్ అగర్వాల్ లు నటించారు కాబట్టి వాళ్ళ వల్ల కాస్త ఓపెనింగ్స్ వస్తాయేమో కానీ ఇక్కడ డిజాస్టర్ అయిన సినిమా కాబట్టి మహేష్ చిత్రానికి పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది . ఇక ఇక్కడ హిట్ అయిన భలే భలే మగాడివోయ్ చిత్రం గజినీకాంత్ గా వస్తోంది కాబట్టి అది హిట్ అవ్వొచ్చు .

- Advertisement -

English Title: Brahmotsavam Tamil Vs Bhale Bhale Magadivoy Tamil Remake

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts