Homeటాప్ స్టోరీస్గ్లామర్ రోల్స్ కి ఇప్పుడు రెడీ అంటోంది కానీ

గ్లామర్ రోల్స్ కి ఇప్పుడు రెడీ అంటోంది కానీ

lavanya tripati ready to skin showఆలస్యం అమృతం విషం అన్నట్లు గా ఉంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరిస్థితి . అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య కు పక్కింటి అమ్మాయి ఇమేజ్ వచ్చింది అయితే ఆ ఇమేజ్ తన పాలిట శాపమై పోయిందని గ్లామర్ రోల్స్ రావడం లేదని , అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు , చిత్రాలు వస్తున్నాయని దాంతో సక్సెస్ పరంగా వెనుకబడి పోయానని బాధపడుతోంది . భలే భలే మగాడివోయ్ , శ్రీరస్తు శుభమస్తు , సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సూపర్ హిట్స్ తనకు లభించినా పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు రాకపోవడానికి ……. బిజీ కాకపోవడానికి కారణం ఏంటో తాజాగా కనిపెట్టేసింది ఈ భామ .

ఇంతకీ ఈ భామ తెలుసుకున్న నిజం ఏంటో తెలుసా ……… ఎక్స్ పోజింగ్ కి ఇన్నాళ్లు దూరంగా ఉండటమే ! కాస్త ఉదారంగా అందాలను ఆరబోస్తే కానీ కుర్రాళ్ళ ని ఆకట్టుకోవడం కష్టమని భావించిందట అందుకే గ్లామర్ తో ఓ ఫోటో షూట్ చేయాలనీ భావిస్తోందట లావణ్య త్రిపాఠి . మరి ఇప్పుడు వర్కౌట్ అవుతుందా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All